అభినయంతో ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్

అందం, అభినయంతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్.
తాజాగా ఈమె డబ్బింగ్ పనులు మొదలు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్టును పంచుకుంది.
దీంతో ‘కూలీ’ చిత్రానికే ఈమె డబ్బింగ్ చెబుతున్నట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి.
కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించారు.
కథానాయకుడు నాగార్జున, శుత్రి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


