ఎస్వీబీసీ సిఇవో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్
ఎస్వీబీసీ సిఇవో గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్
-: తిరుపతి, ఆగస్టు 12 (సదా మీకోసం) :-
తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
అయోధ్య రామాలయ భూమిపూజ లైవ్ ఎస్వీబీసీలో టెలికాస్ట్ కాకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ సీఈవోగా ఉన్న నగేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.
అలాగే కొత్త సీఈవోగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సురేష్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలో ఈరోజు సురేష్ కుమార్ ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు.