అక్రమ మైనింగ్ అరికట్టండి : కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు
అక్రమ మైనింగ్ అరికట్టండి
కమీషనర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు
కోవూరు, ఏప్రిల్ 18 (సదా మీకోసం) :
కోవూరు అక్రమ గ్రావెల్ మైనింగ్ అరికట్టాల్సిందిగా ఎమ్మార్వో, కమిషనర్ లకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సుదీర్ బద్దెపూడి, జనసైనికులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనుమతులు లేకుండా పరిమితులు మించి అక్రమంగా కోట్ల రూపాయల గ్రావెల్ నియోజకవర్గం తరలిపోతుందని అన్నారు.
పంచాయతీలు, నగరం పరిధిలో తిరుగుతున్న హెవీ వెహికల్స్ వలన రోడ్లు నాశనం అవుతున్నాయని వెంటనే అక్రమ మైనింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.