బెంగళూరు రేవ్ పార్టీ వెనుక ఏపీ మంత్రి కాకాణి మాఫియా : సోమిరెడ్డి

0
Spread the love

బెంగళూరు రేవ్ పార్టీ వెనుక ఏపీ మంత్రి కాకాణి మాఫియా

అంతర్రాష్ట్ర మాఫియాతో కాకాణికి సన్నిహిత సంబంధాలు

518 మంది ఎమ్మెల్యేలుండగా కాకాణి స్టికర్ తో ఉన్న కారు, ఆయన పాస్ పోర్టే రేవ్ పార్టీలో ఎందుకు దొరికాయి

నేరం చేసిన ప్రతి సారి బుకాయించడం కాకాణికి అలవాటే

సంఘవిద్రోహ శక్తులతో చేతులు కలిపిన కాకాణిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది

అంతర్రాష్ట్ర సమస్యగా పరిగణించి ఈ ప్రమాదక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి

మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు, మే 21 (స‌దా మీకోసం) :

నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేఖ‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లోనే బెంగళూరు శివారులో రేవ్ పార్టీ జరిగిందని విమ‌ర్శించారు. గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగే రేవ్ పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉన్న కారుతో పాటు ఆయన పాస్ పోర్టు, కొకైన్ తదితర డ్రగ్స్ రేవ్ పార్టీ ప్రదేశంలో దొరికాయని తెలిపారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి…. కాకాణికి అత్యంత ఆప్త మిత్రుడని అన్నారు.

నేరాలు చేసి ఎప్పుడు అడ్డంగా దొరికిపోయినా తాను చేయలేదని బుకాయించడం కాకాణికి మొదటి నుంచి అలవాటేన‌ని తెలిపారు.

అంతర్రాష్ట్ర మాఫియాతో ఉన్న సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయి

కల్తీ మద్యం పంచి ఏడుగురు అమాయకుల చావుకు కారణమైనప్పుడు కూడా కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. నకిలీ పత్రాల కేసులోనూ సుప్రీం కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు కానీ నేరం చేశానని ఒప్పుకోలేదని తెలిపారు.

నడిరోడ్డుపై పబ్లిక్ గా మర్డర్ చేసిన హంతకుడు కూడా తానే చేశానని ఒప్పుకోడని అన్నారు. కాకాణి గత చరిత్ర చూసుకుంటే అంతర్రాష్ట్ర మాఫియాతో ఆయనకు ఉన్న సంబంధాలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు.

2014 ఎన్నికల సందర్భంగా కల్తీ మద్యం పంచి ఏడుగురి ప్రాణాలు బలితీసుకున్న ఘటనలో కాకాణి సహ ముద్దాయిలు బెంగళూరుకు చెందిన డ్రగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా, లిక్కర్ మాఫియాలో కీలకమైన వారని తెలిపారు.

కల్తీ మద్యం కేసులో కాకాణి స్నేహితులైన రాజేంద్ర నిర్మల్ కుమార్, ఎస్ఎన్ సంతోష్, కార్గో లోకేష్, కార్గో రమేష్ నలుగురూ బెంగళూరు వారేన‌ని తెలిపారు. ఇంటర్నేషనల్ స్మగ్లర్ అప్పూ ఇదే కేసులో రాజమండ్రి జైలులో ఉంటూ ప్రాణాలు కోల్పోయాడని అన్నారు.

సింగపూరులో దొంగ పాసుపోర్టుతో దొరికిపోయిన వ్యక్తి కాకాణికి నకిలీ డాక్యుమెంట్ల కేసులో సహ నిందితుడ‌ని తెలిపారు. అత్యంత నటోరియస్ మాఫియాతో కాకాణి గోవర్ధన్ రెడ్డికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయని అన్నారు.

ఇప్పుడు మళ్లీ కొకైన్ తదితర డ్రగ్స్ తో పాటు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉన్న కారు, ఆయన పాస్ పోర్టుతో డ్రగ్ మాఫియా దొరికిపోయిందని అన్నారు.

కాకాణి పాస్ పోర్టు అక్కడ ఎందుకుంది?

“కర్ణాటకలో 224 మంది, ఆంధ్రాలో 175 మంది, తెలంగాణలో 119 మంది కలిపి 518 మంది ఎమ్మెల్యేలున్నారు.

వారిలో ఒక్కొక్కరికి మూడు, నాలుగు ఎమ్మెల్యే స్టికర్స్ ఉంటాయి. మూడు రాష్ట్రాల్లోని ఏ ఒక్క ఎమ్మెల్యే కారు రేవ్ పార్టీలో దొరకలేదు.

ఏ ఎమ్మెల్యే స్టికర్ చిక్కలేదు. ఒక్క కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ తో ఉన్న కారు మాత్రమే దొరికింది.

కాకాణి చెప్పినట్టు అది డూప్లికేట్ అయితే దానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ మాత్రమే దొరికిందా.

కాకాణి పాస్ పోర్టు అక్కడ ఎందుకుంది? నకిలీ పత్రాల తయారీలో కాకాణిని మించిన డాన్ లేరు.

కల్తీ మద్యం రాకెట్ లోనూ కాకాణే కింగ్. ప్రతి కేసులో కాకాణి జైలుకు పోకుండా తప్పించుకున్నాడు అంతే.

మిగిలిన వారంతా జైలు ఊచలు లెక్కపెట్టారు. కల్తీ మద్యం తయారీ, ఎర్ర చందనం స్మగ్లింగ్, డ్రగ్ మాఫియా, నకిలీ పత్రాలు సృష్టించడం, విదేశీ బ్యాంకుల స్మేట్మెంట్ల తయారీ, నకిలీ పాసుపోర్టులు, వీసాలు, ఇమ్మిగ్రేషన్ స్టాంపుల తయారీ, విదేశాల్లో ఆస్తుల పేరిట పత్రాల సృష్టీకరణ వంటి నేరాల్లో ప్రమేయమున్న అంతర్రాష్ట్ర ముఠా ఇది.

ఇది ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచేరి, గోవాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిని అంతర్రాష్ట్ర సమస్యగా పరిగణించి మాఫియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని సొమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన తీవ్రమైన సమస్య

కాకాణి గోవర్ధన్ రెడ్డి గొప్పలు చెప్పాలంటే ఇలాంటి ప్రెస్ మీట్లు చాలవు. ఒక పుస్తకం రాసేంత చరిత్ర ఆయనది అని అన్నారు.

ఒక ప్రజాపోరాటంపైకి ఉసిగొల్పేందుకు 100 మంది హిజ్రాలను సృష్టించిన మహానుభావుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అని విమ‌ర్శించారు.

సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అనుమతి లేకుండానే వైట్ క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసిన ఇంటర్నేషనల్ డాన్ కాకాణి అని అన్నారు.

కాకాణి ఆగడాలు ఒక్క నియోజకవర్గానికి, ఒక్క జిల్లాకు, ఒక్క రాష్ట్రానికి పరిమితం కాలేదని, ఇది కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన తీవ్రమైన సమస్య అని అన్నారు.

జూన్ 4న గ్యాంగ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోతున్నాడు.

తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం చేపట్టబోతోందని తెలిపారు. ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వం, ఏపీలో రాబోతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో రాబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం… సంఘ విద్రోహ శక్తులుగా మారిన ఈ అంతర్రాష్ట్ర గ్యాంగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి నడిపిన ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫేక్ డాక్యుమెంట్స్ మాఫియా ఇప్పుడు డ్రగ్ మాఫియాకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని తాను ప్రభుత్వాలకు సమర్పించబోతున్నానని మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!