వరుస కలయికలతో గిరిధర్ రెడ్డి బిజి బిజి
వరుస కలయికలతో గిరిధర్ రెడ్డి బిజి బిజి
నిన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, లేళ్ల అప్పి రెడ్డి
నేడు మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి
తాడేపల్లి, మార్చి 22 (సదా మీకోసం) :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్నికైన అనంతరం నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కార్యకర్తలతో బిజి బిజి కాగా నేడు పార్టీ రాష్ట్ర నాయకులతో బేటితో గిరిధర్ రెడ్డి బిజి బిజిగా ఉన్నారు.
సోమవారం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డిని అనంతరం శాసనమండలి సభ్యులు, పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జ్ లేళ్ల అప్పి రెడ్డిలతో బేటి అయ్యారు.
నేడు మంగళవారం పార్టీ నెల్లూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తో తాడేపల్లి లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ని అభినందించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా మరింత క్రియాశీలకంగా పని చేయాలని ఈ పదవిలో రాణించాలని ఆకాంక్షించారు.