హాస్టల్ విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నిర్ధేశించిన మెనూ ప్రకారంపౌష్టికాహారాన్ని అందించాలి : జిల్లా రెవిన్యూ అధికారి వెంకట నారాయణమ్మ
హాస్టల్ విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నిర్ధేశించిన మెనూ ప్రకారంపౌష్టికాహారాన్ని అందించాలి
జిల్లా రెవిన్యూ అధికారి వెంకట నారాయణమ్మ
నెల్లూరు కలక్టరేట్, ఆగష్టు 4 (సదా మీకోసం) :
హాస్టల్ విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నిర్ధేశించిన మెనూ ప్రకారంపౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా రెవిన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎస్.సి., ఎస్.టి., బి.సి ప్రభుత్వ హాస్టల్స్ కు సంబంధించిన అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ,సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు,ఆదేశాలు జారీచేశారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, మాట్లాడుతూ, జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులందరికీ నాణ్యత గల విద్యను మరియు పౌస్టికరమైన ఆహారాన్ని అందించాలన్నారు.
తమ పిల్లల పట్ల ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారో, అదే విధమైన జాగ్రత్తలు ప్రభుత్వ హాస్టల్స్ పిల్లల పట్ల తీసుకోవాలని డి.ఆర్.ఓ., హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ను ప్రతి హాస్టల్ నందు ప్రదర్శించడంతో పాటు ఖచ్చితంగా మెనూ ప్రకారం పౌష్టికాహారంను అందించాలన్నారు.
హాస్టల్ వెల్ఫేర్ అధికారులు నిబద్దతతో పనిచేస్తూ హాస్టల్లోని విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని డి.ఆర్.ఓ సూచించారు.
ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్ యందు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు.
ప్రతి హాస్టల్ నందు పేరెంట్స్ కమిటీ సమావేశాలు, అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్ధేశించిన గడువులో జరపాలని, అలాగే ప్రతి హాస్టల్ నందు ఫిర్యాదుల బాక్స్ ను ఏర్పాటు చేసి, సంబందింత రిజిస్టర్స్ ను నిర్వహించాలన్నారు.
స్థానిక పి.హెచ్.సి వైద్యులతో రెగ్యులర్ గా విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ప్రతి రోజు క్లాసు నోట్స్ పరిశీలించడంతో పాటు ఒక అర గంట సేపు మంచి విషయాలు, సామాజిక అంశాలు, కరెంట్ అఫ్ఫైర్స్ పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ విద్యా సంవత్సరంలో నూటికి నూరు శాతం ఉతీర్ణత సాధించేలా ఇప్పటి నుండే హాస్టల్ విద్యార్ధుల పట్ల శ్రద్ధ తీసుకోవాలని డి.ఆర్.ఓ, హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పరిమళ , అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారులు, హోస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.