రైతుల్ని నిండా ముంచేసి మళ్లీ రైతు దినోత్సవాలా..? : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

0
Spread the love

రైతుల్ని నిండా ముంచేసి మళ్లీ రైతు దినోత్సవాలా..?

వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు ప్ర‌తినిధి, జూలై 8 (స‌దా మీకోసం) :

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న రైతు దినోత్స‌వాల‌కు వ్య‌తిరేకంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక విడియో ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రైతులు బాగుండాలని తెలుగుదేశం పార్టీగా తాము ఎప్పుడూ కోరుకుంటామ‌ని తెలిపారు.

అన్నదాతలకు తీరని అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం జరుపుకునే అర్హత లేదని తెల్చి చెప్పారు.

జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో రైతులను కుప్పకూల్చేశారని, ప్రభుత్వమే వారిని ముంచేసిందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా అమలయ్యే అనేక వ్యవసాయ పథకాలను ఏపీలో లేకుండా చేసి రైతులకు తీరనిద్రోహం చేస్తున్నారన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో మైక్రో ఇరిగేషన్ కు ఏడాదికి వెయ్యి, 1200 కోట్లు ఖర్చుపెట్టాం..ఈ మూడేళ్లలో ఎంత ఖర్చుపెట్టారు..ఆ పథకం ఊసే లేకుండా చేసేశారని తెలిపారు.

మా హయాంలో భూసార పరీక్షలు నిర్వహించి సూక్ష్మపోషకాలు ఉచితంగా అందజేశాం.. ఆ కార్యక్రమాన్ని ఎందుకు నిలిపేశారని ప్ర‌శ్నించారు.

వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేసే స్మామ్ కు మేం ఏడాదికి రూ.400 కోట్లకు పైగా ఖర్చుపెడితే..ఈ రోజు దానిని ఎందుకు ఆపేశారని ప్ర‌శ్నించారు.

మేం రెండేళ్లలో రైతురథం పథకం కింద 23 వేల ట్రాక్టర్లను ఇస్తే దానినీ నిలిపేశారు..మూడేళ్ల తర్వాత ఏదో నామమాత్రంగా కొన్ని ట్రాక్టర్లు ఇచ్చార‌న్నారు.

రైతులను నిండా ముంచేసిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం అని పేరెత్తే అర్హత ఎక్కడిదన్నారు.

9 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరాను 12 గంటలకు పెంచుతానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి దానిని 7 గంటలకు తగ్గించారని.. అందులోనూ ఏడు విడతలు కోతలే అని పేర్కొన్నారు.

మద్దతు ధర విషయంలోనూ రైతులు మునిగిపోయారు..ఒక్క నెల్లూరు జిల్లా రైతులే మూడేళ్లలో 3 వేల కోట్లు నష్టపోయారన్నారు.

ఏపీలో రైతులు క్వింటాలుకు రూ.213 మద్దతు ధర నష్టపోయారని సీఏసీపీ కుండబద్దలు కొట్టినా మీకు సిగ్గులేదన్నారు.

మైక్రో ఇరిగేషన్ ను వైసీపీ ప్రభుత్వం పడుకోబెట్టేసిందని అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ బట్టబయలు చేసినా మీలో చలనం లేదని తెలిపారు. ఈ మూడేళ్లలో బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎంత కేటాయించారు..

ఎంత ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. మూడేళ్లలో రైతుల కోసం రూ.1.27 లక్షల కోట్లు ఖర్చుపెట్టామని, అందులో రూ.50 వేల కోట్లు ధాన్యం కొనుగోళ్లకు వెచ్చించామనే తప్పుడు ప్రకటనలను మానుకోమ‌ని హిత‌వు ప‌లికారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినా జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ముందుకే వెళుతోందని పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లను మేం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము..రైతులందరూ తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!