సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్న వాట్సాప్
సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్న వాట్సాప్
ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.
సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం.
ఎప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందబాటులోకి తెస్తూ మరింత పటిష్టంగా యాప్‌ను రూపొందిస్తోంది వాట్సాప్.
కాగా తాజాగా ఫార్వర్డ్ మెసేజ్స్‌పై వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఫార్వర్డ్ మెసెజ్స్‌కు కళ్లెం..!
ఫార్వెర్డెడ్ మెసేజ్స్‌కు కళ్లెం వేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది.
అందులో భాగంగా ఫార్వర్డ్ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తెస్తోన్న ఫీచర్‌తో వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ మెసేజ్‌లకు చెక్ పెట్టనుంది.
ఈ ఫీచర్‌తో ఒక మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వార్డ్ చేయకుండా చేస్తోంది.
దీంతో స్పామ్ మెసేజ్‌లకు వాట్సాప్ అడ్డుకట్ట వేయనున్నది.
ఒకవేళ సదరు మెసేజ్‌ను ఒకరికంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయా మెసేజ్‌ను కాపీ చేసి రెసిపెంట్ కాంటాక్ట్ చాట్‌కు పంపాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన వాట్సాప్‌ల్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఫీచర్ విజయవంతమైతే అందరికీ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ ట్రాకర్ బెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది.