డెంగీ దోమ ప్రత్యేకతలు
1.చాలా మంచి దోమ
మన నిద్రకి యిబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రి పూట పెద్దగా కుట్టదు.ఉదయం 5 నుంచి 7 గంటల లోపు,సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపు కుట్టడం దీనికి ఇష్టం.
2. శుభ్రమైన దోమ
మంచి నీళ్ళలోనే గుడ్లు పెడుతుంది.మురికి నీళ్ళ జోలికి పోదు.
3. మొద్దు దోమ
పెద్దగా ఎగరలేదు . అందుకే ఇంట్లోనే వుండి కుట్టుకుంటూ వుంటుంది. మన బట్టలలోనూ బ్యాగులలోను తిష్ట వేసి మనతోపాటు మరో ఊరు చేరుకుంటుంది. చూసుకుంటుంది.
4. బ్రతకనేర్చిన దోమ
వీలయితే 6 వారాల్లో దీని గుడ్డు పిగులుతుంది ఇబ్బందులు ఉంటే 6 నెలలవరకు గుడ్డు బ్రతికే వుండగలదు.
5. కుట్టే ప్రదేశం
ఎక్కడ మనం బట్టలు సరిగా వేసుకోమో చూసి అక్కడే కుడుతుంది. మోకాళ్ళ క్రింద, మోచేతుల క్రిందనే ఎక్కువగా కుడుతుంది.
6. మనుషులంటే ప్రేమ ఎక్కువ
మనిషి రక్తమంటే ఈ దోమకు ఇష్టమెక్కువ . కుక్కల్ని,పశువుల్ని పెద్దగా కుట్టదు.
7. గండు దోమ
మామూలు దోమల కంటే ఇది లావైన దోమ.
చూడటానికి విచిత్రంగా వంటిమీద పులి మీద చారల లాగా పట్టీలు ఉంటాయి అందుకే దీనిని టైగర్ దోమ అంటారు.
8. ఆడ దోమ మాత్రమే కుడుతుంది.
కుట్టేది ఆడ దోమైన, ఆడ మగ తేడా లేకుండా అందర్నీ కుడుతుంది.



