రాష్ట్రంతో పాటు ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు యువతదే : సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంతో పాటు ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు యువతదే : సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడీలపై ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత మనదే
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారే అసలుసిసలు కార్యకర్తలు..మీ అందరికీ తగిన గుర్తింపు ఉంటుంది
గెలిచినా… ఓడినా… ఎప్పుడు ప్రజల మద్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించుకోవాల్సిన బాధ్యత యువత పై ఉంది.
సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో జరిగిన తెలుగుయువత కార్యవర్గ ప్రకటన కార్యక్రమంలో సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రవి నాయుడు సమక్షంలో నియోజకవర్గ, మండల తెలుగు యువత కమిటీల ప్రకటన
సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ….
రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం యువత మరోసారి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది
గతంలో ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సీనియర్లు కీలక పాత్ర పోషించారు
ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనమీద ఉంది
జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు..ఉన్న కంపెనీలు పారిపోతున్నాయి
ఎన్నికల సమయంలో అన్ని ఫ్రీ అంటూ ప్రజలను మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వివిధ రూపాల్లో ప్రజలపై భారం పెంచేస్తున్నారు
కరెంటు బిల్లులు, పెట్రోల్ డీజిల్,నిత్యావసరాలు ఇలా అన్ని ధరలు పెంచిన వైసీపీ ప్రభుత్వం సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా చేస్తోంది
గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పీకే మైండ్ గేములు, అసత్య ప్రచారాలతో బురద జల్లి ప్రజలను తప్పుదోవపట్టించి ఓట్లు వేయించుకున్న పార్టీ వైసీపీ
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది
ప్రజల కోసం ముందు వరుసలో నిలబడి రోడ్లపై తెలుగు యువత పోరాటాలు చేయాలి
సర్వేపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతోందో అధికారులకి, మంత్రులకు తెలియదంట
సర్వేపల్లి రిజర్వాయర్లో వైసీపీ ఎంపీ పేరుతో లక్ష క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేసిన మాఫియా డాన్ ఎవరో అధికారులకు తెలియదంట
కంటేపల్లి అటవీ భూముల్లో గ్రావెల్ తవ్వేసిన మాఫియా డాన్ ఎవరో కూడా వారికి తెలియదంట
కాకుటూరులో హైవే పక్కనే వంద కోట్ల ప్రభుత్వ భూమిని కాజేసిన డాన్ ఎవరో కూడా అధికారులకు తెలియదంట
అధికారులు, ప్రభుత్వానికి పోయిన ఈ ఘోరాలకు పాల్పడుతున్న పెద్దమనిషి ఎవరో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు..ఆ పెద్దమనిషికి బుద్దిచెప్పేందుకు అందరూ సిద్ధంగా కూడా ఉన్నారు
మనుబోలు మండల రైతుల దశాబ్ధాల కల అయిన డేగపూడి- బండేపల్లి కాలువను ఆర్థిక మంత్రిగా చేసిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా తీసుకురాలేకపోయారు
టీడీపీ అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు మంజూరు చేయించారు
టీడీపీ ప్రభుత్వం లో టెండర్లు పిలిపించి.పని మొదలు పెట్టిస్తే..తీరా గోవర్ధన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక..కమీషన్లు ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్యేకే చెందిన కంపెనీని పనులు చేయకుండా తరిమేశారు
మంచి చేయడం కాకాణికి తెలియదు..ఆయనకు తెలిసిందల్లా తన తప్పులు బయటపడినప్పుడల్లా ఎదురుదాడి చేయడం, కక్షసాధింపులకు పాల్పడటం, నోటికొచ్చినట్టు తిట్టడం
ప్రభగిరిపట్నంలో కొండను కాదు కదా బండను కూడా తాకనీయనని ఎన్నికలకు ముందు హైడ్రామా చేసి…తీరా అధికారంలోకి వచ్చాక కొండలకు కొండలు మాయం చేసిన అనకొండ ఆయన
కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాల్సిందిపోయి రైతుల నుంచి ధ్యానం దండుకుని నెల్లూరులో భారీ భవంతిని కట్టుకుంటున్న పెద్దమనిషి ఆయన
కృష్ణపట్నం పోర్టు ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది ఎప్పుడూ రోడ్డు పై లారీలు ఆపిన రోజు లేదు.. ఈ రోజు ఒక్కో లారీ నుంచి వెయ్యి నుంచి రూ.1500 వరకు దండుకుంటున్నారు..ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళుతున్నాయనేది బహిరంగ రహస్యమే
కాకాణి గోవర్ధన్ రెడ్డి బారి నుంచి సర్వేపల్లి నియోజకవర్గాన్ని, విలువైన సహజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
సోమిరెడ్డి తన జీవితమంతా సర్వేపల్లి నియోజవర్గానికే కేటాయించారు.గెలిచినా ఓడినా మీ మధ్య నే వున్నారు
చంద్రమోహన్ రెడ్డికి తెలిసింది అభివృద్ధి చేయడమే అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత మనది.నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటా
పోలీసులు వైసిపి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.వాళ్ళని పట్టించుకోవాల్సిన పని తెలుగుయువతకి లేదు
అన్యాయం జరిగితే కోర్టు తలుపుతడుదాం.ప్రజల పక్షాన నిలబడి పోరాడుదాం
కష్టకాలం లో పార్టీ వెంట ఉన్న వారే అసలుసిసలు పార్టీ కార్యకర్తలు.ఈ విషయంలో రాజీ లేదు