ఆ సంస్కృతి వీడాలి: సీఎం చంద్రబాబు
ఆ సంస్కృతి వీడాలి: సీఎం చంద్రబాబు
అమరావతి, జూలై 13 (సదా మీకోసం) :
కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని సీఎం చంద్రబాబు కోరారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు విలేఖరులతో చిట్‌చాట్ చేశారు.
ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు నేను దండం పెడతానని అన్నారు.
నేటి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నానని, తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు అని తెల్చి చెప్పారు.
నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు అని, నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నా, అని సీఎం చంద్రబాబు అన్నారు.
అనంతరం ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.