గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్
గిరిజనులకు పౌష్టిక ఆహారం పంపిణీ చేసిన ఎం.వి.రావు ఫౌండేషన్
-: నాయుడుపేట, ఆగస్టు 2 (సదా మీకోసం) :-
నాయుడుపేట మండలం అన్నమేడు మడపొలం తదితర ప్రాంతాల్లో నివసించే నిరుపేద గిరిజనులకు కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం వి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు గిరిజనులకు పంపిణీ చేశారు.
భారత దేశ జాతీయపతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యానగర్ గ్రామానికి చెందిన విద్యా ప్రదాత ఎం వి రావు పౌండేషన్ నిర్వాహకులు గిరిజనులకు పౌష్టికాహారం అందించే నిమిత్తం బిస్కెట్లు, గుడ్లు ,పాలు, పండ్లు పంపిణీ చేశారు.
పౌష్టికాహారం లేక పరిశుభ్రత లోపించిన ప్రదేశాలలో జీవిస్తున్న గిరిజనులకు కరోనా మహమ్మారి వ్యాధి సోకకుండా వారికి ఆయుష్ శాఖ ప్రతిపాదించిన హోమియో మందులు, పౌష్టికాహారం అందజేసి కరోనా పట్ల అవగాహన కల్పించారు.
భారతదేశ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య స్మారకార్థం ఈ ఆహారాన్ని గిరిజనులకు అందజేశారు.
ఈ సందర్భంగా స్వర్గీయ పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో ఎం వి రావు పౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ నిర్వాహకులు ఉన్నారు.