ఎన్టీఆర్ కర్ణాటకకి ఎందుకు వెళ్లారు?
ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్లోకి అడుగు పెడుతున్నారు. అందుకోసం ఆయన ఆదివారం ఉదయం కర్ణాటకకి పయనమై వెళ్లారు. మంగళవారం నుంచి ఆయన చిత్రీకరణలో పాల్గొననున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.
ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా ఇదివరకే రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది.
ఎన్టీఆర్ లేకుండా ఒక షెడ్యూల్ చిత్రీకరణని పూర్తి చేశారు. మంగళవారం నుంచి కర్ణాటకలో ప్రారంభం కానున్న తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు.
ఆయనపై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. భారీ అంచనాలున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటి… ఎన్టీఆర్ – నీల్ సినిమా. పీరియాడిక్ కథతో తెరకెక్కుతోంది.
ఎన్టీఆర్ సరసన ఇందులో రుక్మిణీ వసంత్ నటిస్తున్నారని, దీనికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతోంది. కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, ఛాయాగ్రహణం: భువన్‌గౌడ, ప్రొడక్షన్ డిజైన్: చలపతి.



