వెంకటస్వామి…. ఎంపీటీసీ ఎన్నికల్లో నన్ను బేరం పెట్టిన నువ్వు…అబ్దుల్ అజీజ్ గురించి మాట్లాడడం దారుణం

0
Spread the love

ఎంపీటీసీ ఎన్నికల్లో నన్ను బేరం పెట్టిన నువ్వు…అబ్దుల్ అజీజ్ గురించి మాట్లాడడం దారుణం

ఎంపీటీసీ ఎన్నికలప్పుడు ఏం ఉందని తెలుగుదేశం పార్టీకి వచ్చావు అని నన్ను స్వయంగా కీలారి అడిగారు.

గతంలో ఎన్నో పాపపు పనులు చేసిన నువ్వు…ఒక పెద్ద మనిషివా కిలారి

మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో నీ మీద ఫిర్యాదు చేసింది నేనే

నంబూరి వెంకటరమణమ్మ, ఆమంచర్ల ఎంపీటీసీ అభ్యర్థి

నెల్లూరు రూరల్, డిసెంబర్ 13 (సదా మీకోసం):

సోమవారం నెల్లూరు రూరల్ మండలంలోని ఆమంచర్ల గ్రామంలోని వారి స్వగృహంలో ఆమంచర్ల ఎంపిటిసి అభ్యర్థి నంబూరి వెంకటరమణమ్మ మీడియాతో మాట్లాడారు…

 

*ఈ సందర్భంగా వెంకటరమణమ్మ మాట్లాడుతూ….*

 

ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏం ఉందని తెలుగుదేశం పార్టీకి వచ్చావమ్మ అని నన్ను స్వయంగా కిలారి వెంకట స్వామి నాయుడు అడిగారని, ఆరోజుల్లో అలాంటి పనులు చేసిన ఆయన ఈరోజు మీడియా సమావేశం పెట్టీ మాట్లాడటం దారుణం అన్నారు….

 

గ్రామం మొత్తం ఊరు మొత్తం నాకు వ్యతిరేకంగా ఏకమైన రోజు నన్ను తీసుకెళ్లి ఐదు రోజులు కాపాడిన వ్యక్తి అబ్దుల్ అజీజ్ అని అన్నారు…

 

కిలారి వెంకటస్వామినాయుడు వారి ఇంటి వద్ద మీడియా సమావేశం పెట్టి అబ్దుల్ అజీజ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు.

 

అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నన్ను తీసుకెళ్లి అబ్దుల్ అజీజ్ గారు ఆశ్రయమిచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో నాతోనే స్వయంగా ఇక్కడ ఏముందని తినడానికి వచ్చావు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు…

 

నాతోపాటు వచ్చిన నా బంధువులను అందర్నీ తీసుకెళ్లి తెల్లారేసరికి కిలారి వెంకటస్వామినాయుడు మార్చేశారని అన్నారు..

 

ఆరోజు అన్ని పాపాలు చేసి ఈరోజు అబ్దుల్ అజీజ్ గారి గురించి మాట్లాడుతున్నావూ… నువ్వు కూడా ఒక పెద్ద మనిషివేనా అని ప్రశ్నించారు..

 

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి వెళ్లి కిలారి వెంకటస్వామినాయుడు మీద ఫిర్యాదు చేసింది నేనే అని తెలిపారు…

 

నా మరుదుల్ని అందర్నీ, నా బంధువుల్ని నా కుటుంబ సభ్యుల్ని ప్రలోభాలకు గురి చేసి కీలారి వెంకట స్వామి నాయుడు అమంచర్ల గ్రామంలో నన్ను ఒంటరి దాన్ని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!