నెర‌సం ఆధ్వ‌ర్యంలో మార్చి 3న ఉగాది పుర‌స్కారాలు

0
Spread the love

నెర‌సం ఆధ్వ‌ర్యంలో మార్చి 3న ఉగాది పుర‌స్కారాలు

నెల్లూరు సాంస్కృతికం, మార్చి 21 (స‌దా మీకోసం) :

నెల్లూరు జిల్లా రచయితల సంఘం (నెర‌సం) ఉగాది పురస్కారాలను ఏప్రిల్ 3తేదీ ఆదివారం టౌన్ హాల్ లోని రీడింగ్ రూమ్ లో ఉదయం 11 గంటలకు అందజేయడం జరుగుతుందని సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ అన్నారు.

సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ కవి సాహిత్యానికి విశిష్ట సేవలందించి పధ్య కళా పరిషత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విలువైన సాహిత్యాన్ని అందించిన మెట్టు రాంచంద్ర ప్రసాద్ కి ఈ సంవత్సరం ఉగాది పురస్కారం అందిస్తున్నామని అన్నారు.

మరి కొందరికి ఆత్మీయ పురస్కారాలు కూడా ఉంటావని ఆయన పేర్కొన్నారు. కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ పురస్కారాలు అందిస్తామన్నారు.

“నెల్లూరు జిల్లా రచయితల సంఘం” 2008 లో ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేయడం జరిగింది.

శిక్షణ తరగతులు నిర్వహించడం, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,వక్తృత్వ పోటీలు నిర్వహించడంతో పాటు కవి సమ్మేళనాలను నిర్వహించడం జరిగింది.

ఉగాది పురస్కారాలు, ఆత్మీయ పురస్కారాలతో ప్రముఖులను గౌరవించాం. “నెరసం” పురస్కారాలు అందుకున్న ప్రముఖుల్లో డాక్టర్ ఎన్. గోపి, డాక్టర్ అద్దేపల్లి రామ్మోహనరావు, ప్రముఖ సినీ నటుడు రంగనాథ్, బీహార్ హైకోర్టుమాజీ ప్రధాన న్యాయమూర్తి నర్సింహారెడ్డి, ప్రముఖ రచయితలు డా:రాధేయ, గుత్తికొండ సుబ్బారావు, కొండరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి, అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ వైస్ ఛాన్సలర్ వీరయ్య, ప్రముఖ సంఘసేవకుడు కోట సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు.

శుభకృత్ (2022) నూతన సంవత్సర ఉగాది సందర్బంగా 3.4.2022 న ఉగాది పురస్కారం తో పాటు ఆత్మీయ గౌరవ పురస్కారాలు అందిస్తున్నాము. ఈ సందర్బంగా కవిసమ్మేళనం నిర్వహించి కవులను సత్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.

కవిసమ్మేళనంలో పాల్గొనదలచిన వారు తమ పేర్లను 9440275013 కి వారం రోజుల్లోపల తెలియచేయాలని అన్నారు. విలేఖర్ల సమావేశంలో హస్తి మోహన్ రాజు, ములుగు లక్ష్మి, సందడి అరుణకుమారి, సయ్యద్, నజ్మా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!