కక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య-ఎల్1
కక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య-ఎల్1
శ్రీహరికోట, సెప్టెంబర్ 2 (సదా మీకోసం) :
ఆదిత్య-ఎల్1ను పీఎస్ఎల్వీ-సి 57 రాకెట్.. కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 విడిపోయినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. తర్వాత ‘ఎల్1’ (లగ్రాంజ్) పాయింట్ వైపు ఆదిత్యను నడిపిస్తారు.
ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతం (ఎస్వోఐ)ను దాటి వెళుతుంది. అనంతరం క్రూజ్ దశ ప్రారంభమవుతుంది. ఇలా నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఉపగ్రహం.. ఎల్1 బిందువును చేరుకుంటుంది. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం ఆదిత్య-ఎల్ చేసే వీలుంది.