ఎన్.ఈ.సీ గా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ
ఎన్.ఈ.సీ గా మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ
-: అమరావతి, ఆగస్టు 3 (సదా మీకోసం) :-
ఆంధ్రపదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరోసారి బాధ్యతలు తీసుకున్నారు.
ఇటీవల హైకోర్టు నిమ్మగడ్డను ఎన్.ఈ.సీగా కొనసాగాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఆయనను పునర్నియమించిన విషయం తెలిసిందే.
ఆంధ్రపదేశ్ గవర్నర్ హరిచందన్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారం నాడే హైదరాబాద్‌లో తాను బాధ్యతలు చేపట్టినట్లు రమేశ్‌కుమార్ తెలిపారు.
తాను బాధ్యతలు చేపట్టినట్లు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సమాచారమిచ్చినట్లు ఆయన తెలియజేశారు.
ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ ద్వారా వారందరికీ సమాచారమందించినట్లు ఆయన వివరించారు.
విజయవాడలోని కార్యాలయంలో బాధ్యతల నిర్వహణకు నేడు ఇక్కడు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఎలక్షన్ కమీషన్ అనేది స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ అనీ, రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విధుల నిర్వహణలో తనకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాననీ, గతంలో మాదిరిగానే ప్రభుత్వ సహకారం ఉంటుందని తాను అనుకుంటున్నా’ అని ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.