మడమనూరులో మెడికల్ క్యాంపు
మడమనూరులో మెడికల్ క్యాంపు
కార్యక్రమంలో పాల్గొన్న మలేరియా అధికారి ఈ. హుస్సేన మ్మ
మనుబోలు, అక్టోబర్ 31 (సదా మీకోసం):
మండలంలోని మడమనూరు గ్రామపంచాయతీలో జ్వరంతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతుండటంతో తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి డా. ఈ. హుస్సేనమ్మ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగరాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజయ్య ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈ మెడికల్ క్యాంపు లో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, విస్తరణాధికారి రమణయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కార్తీక్, పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలు హాజరైనారు.
ఈ మెడికల్ క్యాంపులో సైఫనోత్రిన్ మస్కిటో స్ప్రే చేయించడం జరిగింది. పంచాయితీ కార్యదర్శి రేష్మ, సోనీ, రాజా ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడర్ మురుగు కాలువల పైన పేడ దిబ్బల పైన , వీదికి ఇరువైపులా చెల్లించడం జరిగింది.
అదేవిధంగా నేటి రాత్రికి జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాలతో నాలుగు ఫాగింగ్ మిషన్లతో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.