ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి జనసేన భరోసా : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనవాణి జనసేన భరోసా
- ప్రజల కష్టాలను స్వయంగా అధ్యయనం చేస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్
- జనసేన పార్టీ జనవాణికి ప్రజల నుండి అపూర్వ స్పందన
- జగన్ ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలను పవనన్న ప్రభుత్వంలో పరిష్కరించేందుకు ప్రణాళికల రూపకల్పన
- పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రణాళికలు అమలు చేస్తారు
- పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
-: నెల్లూరు నగరం, జూలై 03 (సదా మీకోసం) :-
నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 48వ రోజున ఓల్డ్ చెక్ పోస్ట్ ప్రాంతంలోని రైల్వే గేట్ వైపు డొంకలలో జరిగింది.
ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా తమవంతు పోరాటాం చేస్తామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు, ఆ సమస్యలపై పార్టీ తరఫున పోరాటాం చేసి ప్రభుత్వం చేత పరిష్కారం చేయించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు జనవాణి జనసేన భరోసా అనే కార్యక్రమానికి స్వీకారం చుట్టారని తెలిపారు.
విజయవాడలో నేడు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని, వైసీపీ ప్రభుత్వ చర్యల వల్ల దగా పడ్డ వారందరూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకి బారులు తీరారని అన్నారు. నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లా ప్రజల నుండి సైతం స్వయంగా అర్జీలు స్వీకరిస్తారని, పవనన్న ప్రజాబాటలో తాము అధ్యయనం చేసిన సమస్యలను సైతం పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతాం అని అన్నారు.
ఈ జనవాణి కార్యక్రమం ద్వారా జగన్ ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలను గుర్తించి పవనన్న ప్రభుత్వంలో వాటిని ఎలా పరిష్కరించాలో ప్రణాళికల రూపకల్పన చేస్తామన్నారు.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రణాళికలను అమలు చేసి ప్రజలకు అండగా నిలబడతాం అని అన్నారు. ప్రజలందరూ మనస్ఫూర్తిగా తమ ఆశీస్సులు అందించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేలా అండగా నిలవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు.
కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.