ఇటుక రాయి బట్టీలు వద్ద మైనర్ బాలిక అనుమానాస్పద మృతి…. పంచనామ సూన్యం..!

ఇటుక రాయి బట్టీలు వద్ద మైనర్ బాలిక అనుమానాస్పద మృతి…. పంచనామ సూన్యం..!
చేజర్ల, జనవరి 6 (సదా మీకోసం) :
చేజర్ల మండలం లోని పుట్టు పల్లి గ్రామపంచాయతీ కొట్టాలు గ్రామం ఉలవపల్లి గ్రామ సమీపంలో ఉన్న కొట్టాల గ్రామానికి చెందిన ఓ యజమాని ఇటుక రాయి బట్టీలో 13 సంవత్సరాల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గ్రామంలోని ఓ వ్యక్తి అక్రమ ఇటుకుల బట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అందులో పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి పేద కూలీలు నేను తీసుకొచ్చి బట్టి నిర్వహణ కొనసాగిస్తున్నారు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తూ కూలీలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ కూలీలలో కుమార్ దిన్ మార్జి 13 సంవత్సరాల అనే యువతని హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా లేబర్, చైల్డ్ ఉన్నత అధికారులు ఆదివారం బట్టీల దగ్గరకొచ్చి వివరాలను సేకరించారు. బాధితులతో విడివిడిగా జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. వచ్చిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జరిగిన సంఘటనపై విచారణ చేసాము నివేదికపై జిల్లా అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఇటుక బట్టీలు యజమానులు గురించి సేకరించిన నేపథ్యంలో కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.