కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండండి : లీలా మోహన్ కృష్ణ
-: నాయుడుపేట, ఆగస్టు 12 (సదా మీకోసం) :-
కరోనా మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎం. వి.రావు ఫౌండేషన్ ఛైర్మెన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కోరారు.
నాయుడుపేట మండలంలోని కుచివాడ కాలనీ లోని నిరుపేద గిరిజనులకు కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎం.వి.రావు ఫౌండేషన్ కార్యదర్శి ముప్పవరపు విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని వారికి కరోనా మహమ్మారి పట్ల బయపడనవసరం లేదని దానికి సంబంధించి ప్రభుత్వం వ్యాక్సిన్ కనిపెట్టారని అన్నారు.
ప్రతిఒక్కరు సామాజిక దూరం పాటించాలని,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,అదేవిధంగా వ్యాది నిరోధక శక్తిని పెంపొందించు కొనేందుకు కేంద్ర ఆయుష్ శాఖ సూచించిన ఆర్సీనికేం ఆల్బమ్ 30 హోమియో మందులు వాడాలి అని కోరారు.
విధిగా మాస్క్ దరించాలి అని అని కోరారు.ఈ హోమియో మందులు 3 రోజుల పాటు వాడాలని సూచించి డి విటమిన్ వాడాలని లీలా మోహన్ కృష్ణ కోరారు.
అనంతరం కాలనీ ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎం.వి.రావు.ఫౌండేషన్ నిర్వాహకులు ఎం.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 12-08-2020